తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థిని అభినందించిన సీఈవో చైతన్య ఖమ్మంలో జరిగిన SGF రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల ఎంపికల్లో శ్రీ నలంద కాలేజీ విద్యార్థి వరుణ్ అండర్-19 విభాగంలో ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నలంద విద్యాసంస్థల సీఈవో చైతన్య విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రాష్ట్ర స్థాయికి ఎంపికవడం ఎంతో గర్వకారణం. క్రమశిక్షణతో సాధన చేస్తే జాతీయ స్థాయికి ఎదగడం ఖాయం" అని అన్నారు. రానున్న పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ