తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ యేదురుగడ్డ ఎస్టీ వినస్ హై స్కూల్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు కుష్ఠు వ్యాధి గురించి అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సమతుల ఆహారం (Balanced Diet), వ్యక్తిగత పరిశుభ్రత, “ఈట్ రైట్ & డ్రింక్ రైట్,” సరైన చేతులు కడుక్కోవడం (SUMAN-K విధానం) గురించి వివరించారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అవి ఆరోగ్యానికి హానికరం కావచ్చని సూచించారు.జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) గురించి కూడా అవగాహన కల్పించి, కృమినాశక మాత్రలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి అవసరమని తెలిపారు. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తోందని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. పుల్లారెడ్డి (PO NTEP), డా. తేజశ్రీ (PO CHI), డా. స్వప్న (MO, PHC రేగల్ల), DPMO మోహన్, భద్రు PT మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ