Friday, 18 September 2026 03:09:15 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

దళితులపై వివక్ష వీడాలి.. హక్కులు కల్పించాలి

Date : 03 August 2026 04:36 PM Views : 124

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - ఏజెన్సీలో గిరిజనులతో పాటు దళితులకు సమాన హక్కులు ఇవ్వాలి - ఎస్‌సీ సబ్‌ప్లాన్ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి - ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తాం - డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ - కలెక్టరేట్ ముట్టడి విజయవంతం దళితుల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత విధానాలను విరమించి, రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తరతరాలుగా నివసిస్తున్న దళితులకు కూడా సమాన హక్కులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు. సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు మంజూరు చేసి భూ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీ సబ్‌ప్లాన్ పథకాన్ని పునరుద్ధరించి నిధులను పూర్తిగా విడుదల చేయడంతో పాటు, దళిత యువ పారిశ్రామికవేత్తలకు మంజూరైన ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేసి, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళిత నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించాలని ఆయన కోరారు. దళితుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో భారీ ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని అన్నారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అంకితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు గనిగళ్ళ వీరాస్వామి విశంశెట్టి పూర్ణచంద్రరావు కంచర్ల జమలయ్య డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు దొంతమాల చెన్నయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ పేరాల శ్రీనివాసరావు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే రత్నకుమారి పోలమూరు ధనలక్ష్మి మద్దాల హరిత జంగం మోహన్ రావు మామిడాల ధనలక్ష్మి వరుసు రామకృష్ణ పొలామూరి శ్రీనివాస్ మండల రాజు, రవికిషోర్ మేదిని లక్ష్మీ దారా లక్ష్మి ఇమ్మానుయేల్ నాగమణి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :