Thursday, 17 September 2026 06:15:52 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 21 June 2026 07:28 PM Views : 373

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.ప్రత్యేక ప్రార్థనలతో సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయి.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి.పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి.ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను జరుపుకోవాలి.ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను సందర్శించిన సాబీర్ పాషా. మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనమని, ఈ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ చాటిచెప్పాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 26న జరగనున్న మొహరం పండుగను పురస్కరించుకుని జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆదివారం పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ... మొహరం పండుగ రోజుల్లో నిర్వహించే ప్రత్యేక పూజల వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయని, లోకకల్యాణం జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ వేడుకలు గంగా-జమునా తెహజీబ్‌కు, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. పవిత్రమైన ఈ రోజుల్లో భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి మానవుడికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో ఐక్యత పెరుగుతుందని వివరించారు. ఆషూర్ కనా కమిటీ నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో నయీమ్ ఖురేషి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పడాల భవాని, రామారావు, సాంబిరెడ్డి, ఇమ్రాన్, జమాలుద్దీన్, మొహమ్మద్ అలీ, జడల అరుణ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :