తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ సమీపంలోని నవభారత్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని, ఎస్పీ క్యాంప్ కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడిన ఎస్పీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.భవనంలో ఏర్పాటు చేయనున్న కార్యాలయ గదులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బి 2 ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్, ఆర్ & బీ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ