తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దివ్యాంగులకు సహాయ ఉపకరణములు, వివాహ ప్రోత్సాహక బహుమతి, దివ్యాంగులకు మరియు ట్రాన్స్ జెండర్ పర్సన్స్ కు ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం సబ్సిడీ పంపిణీ. దివ్యాంగులకు సహాయ ఉపకరణములు పంపిణీ కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా అధ్యక్షత వహించారు. జిల్లాలోని దివ్యాంగులు సహాయ ఉపకరణాలు కొరకు టీజీఓబి ఎంఎంఎస్ వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని జిల్లా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారికి తెలంగాణ వికలాంగుల కోపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అందచేసిన సహాయ ఉపకరణాలు కొత్తగూడెం నియోజకవర్గ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దివ్యాంగులకు వారి దిన వారి చర్యలలో సహాయ ఉపకారణములు ఎంతో ఉపయోగపడతాయని, లబ్ది దారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని అన్నారు. రెట్రో ఫిట్టెడ్ మోటర్ వెహికల్స్ (స్కూటీ) అర్హులైన లబ్ది దారులకు సి.ఎస్.ఆర్. ద్వారా సహాయ ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని, జాబితా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ట్రాన్స్ జెండర్ పర్సన్స్ సమాజంలో వివక్షకు గురికాకుండా సొంతంగా ఉపాధి పొందేలా ప్రభుత్వం ఋణాలు మంజూరు చేస్తుందని ఐదుగురికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వారి సొంత కాళ్ల మీద నిలబడాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులకు రెట్రో ఫిట్టర్ మోటార్స్ వెహికల్స్ 25, బ్యాటరీ ట్రై సైకిళ్లు-7, బ్యాటరీ వీల్ చైర్ 7, దివ్యాంగుల ఎకనమిక్ రీహాబిలిటేషన్ సబ్సిడీ 8 మందికి, వివాహ ప్రోత్సాహక బహుమతి 8 మందికి, ట్రాన్స్ జెండర్స్ ఆర్థిక పునరావస పథకం సబ్సిడీ 5 మొత్తం 60 మంది లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి. వేణుగోపాల్ అడిషనల్ కలెక్టర్ , మూడ్ గణేష్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఎన్. శ్యామల కార్పొరేటర్, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు గుండపునేని సతీష్, సిబ్బంది వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్ మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ