Wednesday, 16 September 2026 02:39:58 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఇంటర్మీడియట్ పరిక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 02 March 2026 05:44 PM Views : 160

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) పరీక్షా కేంద్రం, తెలంగాణ సామాజిక సంక్షేమ నివాస పాఠశాల (TGSWRS) బాలుర విభాగంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు.పరీక్షలు నిబంధనల మేరకు, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా అనే అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల హాజరు నమోదు విధానం, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ, ప్రశ్నపత్రాల రవాణా మరియు భద్రపరచడం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాయేందుకు తగిన డెస్కులు, సరైన లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ గణితశాస్త్రం పేపర్–IA, వృక్షశాస్త్రం పేపర్–I మరియు రాజకీయ శాస్త్రం పేపర్–I పరీక్షలకు జనరల్ విభాగంలో 8,429 మంది, వృత్తిపర (వొకేషనల్) విభాగంలో 1,860 మంది కలిపి మొత్తం 10,289 మంది అభ్యర్థులకు హాజరు కేటాయించగా, అందులో 9,786 మంది హాజరై, 503 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణ, అప్రమత్తత మరియు పారదర్శకతతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తదుపరి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీ లో సంభధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :