తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, డిసెంబర్ 5 (తెలుగు వెలుగు } గీతా జయంతి మహోత్సవములు-11-12- 2024 సందర్భంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత శ్లోకాల పోటీలు కొత్తగూడెం లో, విద్యా నగర్ కాలనీ మాస్టర్ EK విద్యాలయం లో ది. 07.12.2024 రోజున 6 తరగతి నుండి 9 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 6 వ అధ్యాయం లో భగవద్గీత శ్లోకాల పైన పోటీలు , ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన బ్రోచర్, ఫ్లెక్సీ ను చుంచుపల్లి పోలీసు స్టేషన్ CI వెంకటేశ్వరరావు , వన్ టౌన్ పోలీస్ స్టేషన్ CI కరుణాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు యెల్దండి పూర్ణచందర్ రావు , వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ G. రమాదేవి, వికాస తరంగిణి సభ్యులు P.S. వెంకటేశ్వర షాబు, నంది శశి కుమార్, CH. లక్ష్మీ నారాయణ, హిందూ ధర్మ ప్రచారకర్త గుములాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ