తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పల్లా సుధీర్ మృతి కుటుంబానికి తీరని లోటు.సుధీర్ రెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి అకాల మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, పడమటిపల్లి గ్రామంలోని పల్లా నివాసాన్ని బుధవారం ఆయన సందర్శించారు. దివంగత సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయులైన నర్సింహారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే సుధీర్ రెడ్డి మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్రశోకంలో ఉన్న పల్లా నర్సింహారెడ్డి కుటుంబానికి పార్టీ శ్రేణులు ఎల్లవేళలా వెన్నంటి ఉంటాయని సాబీర్ పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ