తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్వజ్ఞాని ప్రార్థన మందిరం నిర్వాహకురాలు ఫాస్టర్ డా. కె. సుబ్బలక్ష్మి ని ప్రకృతి ఆశ్రమం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నూతన సంవత్సరం వేడుకలలో బాగంగా, గొల్లగూడెంలోని సర్వజ్ఞాని ప్రార్ధనా మందిరంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు సుగుణారావు మాట్లాడుతూ... క్యాన్సర్, ఇతరవ్యాధులకు కారణమయ్యే ప్లాస్టిక్ ను వాడకూడదాని, సంస్ధ వ్యవస్థాపకులు, ప్రకృతి కవి జయరాజు ఇచ్చిన పిలుపునందుకుని , చర్చ్ లో నెలకు రెండు సార్లు అన్నదానం స్టీల్ ప్లేట్స్, గ్లాసులలోనే చేస్తూ, సభ్యులకు ప్రకృతిపై అవగాహనను కల్పిస్తున్న సుబ్బలక్ష్మి ని ఆశ్రమం తరపున ఎంపిక చేశామన్నారు. ఆమె గత 10 నెలలుగా ఆచరిస్తూ, ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహనను కల్పిసున్నారని తెలిపారు. ఆమె మాట విని అందరూ స్టీల్ పాత్రలనే వాడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి, ఆశ్రమ మెమంటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, బి.శివకుమార్, నాగేశ్వరరావు,అనిల్, సత్తిబాబు, విశ్వేశ్వరీ, శ్రీనివాస్, సౌందర్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ