తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 18 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలంలో గత రెండు రోజులు నుండి వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేని పేట తండా వాసి బీరెల్లి సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో మూడున్నర తులాల బంగారం,12 వేల రూపాయలు విలువగల వెండి మరియు పడమటి నరసాపురం గ్రామం నందు ప్రధాన రహదారి కీ ఉన్న బాలాజీ పైపుల దుకాణం నందు 35000 వేలరూపాయలు విలువగల పైపు బిండిల్స్ దొంగలు దోచుకెళ్లారు ఇదిలా ఉండగా గత రాత్రి మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం నందు తలుపులు పగలగొట్టి అమ్మవారి నగలను దొంగలు దోచుకెళ్లారని స్థానికులు తెలియజేశారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గుడి దగ్గరకు వచ్చి దర్యాప్తు చేపట్టారు. గుడిలో జరిగిన దొంగతనం పై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ దొంగతనాలపై గట్టి నిగావెయ్యాలని స్థానికులు కోరుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ