Thursday, 17 September 2026 03:56:17 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు – ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్.

Date : 03 July 2026 02:05 PM Views : 172

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల చెమటను రాజకీయ లాభాలకు వాడుకోవద్దు సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడాలనుకుంటే దానికి సరైన వేదిక తెలంగాణ శాసనసభ. అక్కడ ప్రభుత్వం సమాధానం చెబుతుంది, అవసరమైతే సింగరేణి యాజమాన్యం కూడా అధికారికంగా వివరణ ఇస్తుంది,కానీ గనులపైకి వచ్చి పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సింగరేణి సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సంస్థ ప్రతిష్ట,పరపతి దెబ్బతిం టుందని ఏఐటీయూసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7.5 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి చూపించారని, అప్పట్లో ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ బహిరంగంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు మౌనం వహించిన వారు, ఇప్పుడు నీతులు చెప్పడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. మేము ఈ విధానాన్ని తప్పు పడుతున్నాము.ప్రభుత్వం ఎవరిదైనా, తప్పు జరిగితే ప్రశ్నించడం మా విధానం.బొగ్గు ఉత్పత్తి గణాంకాలపై అనుమానాలు ఇవాళ కొత్తగా వచ్చినవి కావు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు నిర్వహించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ అవసరాలకు అనుగుణంగా సింగరేణిని రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడం కొత్త విషయం కాదు. అయితే ఏఐటీయూసీ మాత్రం మొదటి నుంచీ ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. సింగరేణి ప్రతిష్టకు భంగం కలిగించే రాజకీయాలను ఎవరు చేసినా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.మా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనoనేని సాంబశివరావు గారు మిమ్మల్ని ఎల్లప్పుడూ "హరీష్‌రావు గారు" అని గౌరవంగా సంబోధించారు. కానీ మీరు మాత్రం "సాంబశివరావు" అంటూ పదేపదే ఏకవచనంతో సంబోధించడం హుందాతనo కాదు. విభేదాలు ఉండవచ్చు, విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్య సంస్కృతికి తగదు.రాజకీయాల్లో పరస్పర గౌరవాన్ని పాటించడం ప్రతి నాయకుడి బాధ్యత. మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు మా గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఇచ్చిన సమాధానాన్ని కావాలనే వక్రీకరించడం దురుద్దేశపూరితం. ఆయన ఎక్కడా "బొగ్గు ఎక్కడ కూడా దొంగతనం జరగలేదు" అని చెప్పినాడు, టార్గెట్ రాకున్నా వచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపెట్టారు ఈ పద్ధతికూడా తప్పే అనికూడా చెప్పారు. బొగ్గు దొంగతనం జరిగింది అని చెప్పడం వలన కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు అయోమయానికి గురవుతారని మాత్రమే పేర్కొన్నారు. కార్మికుల గౌరవాన్ని, సంస్థ విశ్వసనీయతను కాపాడాలన్నదే ఆయన ఉద్దేశం. ఆ వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి ఆయుధంగా మార్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలి. దాదాపు 70 వేల మంది శాశ్వత, కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల జీవనోపాధి కంటే ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత దురదృష్టకరం. గనులపైకి వందలాది మంది బొగ్గు చూపెట్టండని అధికారులపై వత్తిడి తెస్తే కార్మికులు అభద్రతకు లోనవుతారు.సింగరేణిని రాజకీయ రణరంగంగా మార్చే ప్రతి ప్రయత్నాన్ని కార్మికలోకం తిప్పికొడుతుంది.ఇప్పటికే సింగరేణిలో అధిక రాజకీయ జోక్యం, అవినీతి వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోయింది.సింగరేణికి భవిష్యత్తులేని పరిస్థితి నెలకొంది.ఈ వాస్తవాన్ని కార్మికులు గమనిస్తున్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసే, సింగరేణి ప్రయోజనాలకు భంగం కలిగించే రాజకీయ జోక్యాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.సింగరేణిని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, కార్మికుల హక్కులను కాపాడడం, సంస్థ ప్రతిష్టను పరిరక్షించడం, సంస్థ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం ఏఐటీయూసీ లక్ష్యం.ఈవిషయంలో కార్మిక సోదరులు ఐక్యమత్యంగా ఉండాలని ఒక ప్రకటనలో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలియచేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :