Thursday, 17 September 2026 12:42:56 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

Date : 17 September 2026 11:50 AM Views : 14

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 1948 సెప్టెంబర్ 17 — తెలంగాణ చరిత్రలో ఒక చిరస్మరణీయ దినం. నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజు ఇది. ఆ మహత్తర ఘట్టానికి 78 సంవత్సరాలు పూర్తయి, నేడు 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా, తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వీరులను, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మహనీయులను, ప్రాణత్యాగం చేసిన అమరవీరులను హృదయపూర్వకంగా స్మరించుకుంటున్నాను. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలకు మరింత చేరువైన పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీజీ తన జీవిత అంతిమ సూత్రంగా చెప్పినట్టు — “ఎప్పుడైనా సందేహం కలిగితే, నీవు చూసిన అత్యంత పేద, బలహీనుడైన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకో, నీవు తీసుకోబోయే ప్రతి చర్య అతనికి ఉపయోగపడుతుందా అని ప్రశ్నించుకో” — ఆ స్ఫూర్తే మన ప్రజాపాలనకు మార్గదర్శకం. ప్రజాపాలన అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల ద్వారా సాగే పరిపాలన మాత్రమే కాదు... ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడం, రైతుకు అండగా నిలవడం, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్య, వైద్యం, మౌలిక వసతులను మెరుగుపరచడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే నిజమైన ప్రజాపాలన. మహాకవి దాశరథి అన్నట్టు “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” — ఆ వీణలో ప్రతి తీగ నేడు అభివృద్ధి రాగాన్ని పలికిస్తోంది. ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తోంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణన ఇందుకు మార్గదర్శిగా నిలుస్తోంది. మన జిల్లాలో ఈ పాలన సాధించిన ప్రగతిని క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను: * మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పటివరకు కోట్లాది మంది మహిళలు ప్రయోజనం పొందారు, వందల కోట్ల రూపాయల ప్రయాణ ఖర్చు ఆదా అయింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఊరట కలిగింది. * రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల విలువైన ఉచిత వైద్య సేవలు అందించాం. * రైతుభరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం, రైతుబీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు బీమా పరిహారం, పంట రుణమాఫీ ద్వారా వేలాది మంది రైతులకు రుణ విముక్తి కల్పించాం. * గృహజ్యోతి పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. * ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో ఆహార భద్రతను మరింత బలోపేతం చేశాం. * దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేశాం. * గోదావరి వరదలకు అడ్డుకట్ట వేసేందుకు కరకట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. * భద్రాచలం వద్ద గోదావరి నదిపై రెండో వంతెనను ప్రారంభించాం. * పాండురంగాపురం నుంచి మల్కాన్‌గిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా, భక్తుల సౌకర్యార్థం సారపాక వరకు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. * పోడు భూముల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు బాటలు వేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తెలంగాణ ఆయిల్‌పామ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. * భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కేవలం పరిశ్రమల జిల్లాగా కాకుండా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసీ సంక్షేమం రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. * ఒక్క సెంటిమీటర్ జాతీయ రహదారి లేని జిల్లాను, జాతీయ రహదారులతో అన్ని వైపులా కనెక్టివిటీ పెంచుతున్నాం. దీనివల్ల వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సాగునీటి రంగంలోనూ జిల్లా గణనీయమైన ప్రగతి సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ, మూడు పంపుహౌస్‌ల పనులు పూర్తయ్యాయి. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా రాజీవ్ లింక్ కెనాల్‌ను ప్రారంభించాం. ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా లక్షా 11 వేల ఎకరాలకు పైగా నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షా 57 వేల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు, మరో 42 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు చేపట్టాం. సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తికాగా, పర్యావరణ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. సాగునీటి వనరులను బలోపేతం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే మా లక్ష్యం. అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ట్రయల్ రన్ పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాం. సంక్షేమంతో పాటు జిల్లాకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, భవిష్యత్ తరాలకు మెరుగైన అభివృద్ధి అవకాశాలు సృష్టించడం కూడా ప్రజాపాలనలో ముఖ్యమైన భాగమే. ఈ దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక నిపుణుల బృందం ప్రతిపాదిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం వంటి అంశాలను అధ్యయనం చేసింది. ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా భూసేకరణ తదితర తదుపరి చర్యలు చేపడుతున్నాం. ఈ విమానాశ్రయం సాకారమైతే పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణకు, సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో రూ.351 కోట్లతో తొలి దశ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రైల్వే, రహదారి అనుసంధానంతో భద్రాచలం, పాపికొండలు, కిన్నెరసాని వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. మారుమూల గిరిజన గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు... రైతు పొలం నుంచి మహిళ ఇంటి వరకు... ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి ఫలాలు చిట్టచివరి అర్హుడి ఇంటి గడప వరకు చేరేలా, ప్రజలకు మరింత చేరువైన పాలన అందించేలా మనమంతా సమిష్టిగా కృషి చేద్దాం. ప్రజాపాలన మరింత సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరం. మనందరం సమిష్టిగా పనిచేసి మన జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుదాం. తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వీరులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :