తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు) : భద్రాచల శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న వంశస్థులు, పదవతరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు ప్రస్తుతం కొత్తగూడెంలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు శ్రీనివాసరావు చిన్న కుమారుడు కంచర్ల ప్రణవ్ వెస్ట్ బెంగాల్, ఖరగ్పూర్ IIT చేశాడు.IIT-KGP 75 ఏళ్ల చరిత్రలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి 'డైరెక్టర్స్ గోల్డ్ మెడల్' సాధించడం అద్భుతమైన చరిత్ర. దీనితో పాటు అత్యుత్తమ ప్రతిభకు 'డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గోల్డ్ మెడల్' మరియు డిపార్ట్మెంట్ టాప్ సిల్వర్ కూడా గెలుచుకోవడం ఎంతో గర్వకారణం దశాబ్దాలు మారిన చరిత్రలో మాకు కొన్ని పేజీలు ఉండాల్సిందే అన్నట్లుగా ప్రణవ్ కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకు తోటి సన్నిహితులు, మేధావులు భవిష్యత్తులో ప్రణవ్ ఇంకా ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ