తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భక్తులకు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి శ్రీసీతారామచంద్ర స్వామీ దేవాలయ ఆలయ పునః నిర్మాణాలు నాణ్యతతో సకాలంలో పూర్తిచేయాలి దేవాలయంలో నిర్మాణాలు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ తో కలిసిన పరిశీలించిన జిల్లా కలెక్టర్ భద్రాచలం పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేపెట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.శనివారం భద్రాచలం గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్‌ల వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.నిమజ్జనానికి లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీ.సీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వివరించారు. నదీ తీర ప్రాంతంలో ఎటువంటి అపశృతి జరగకుండా విస్తృతంగా, భద్రతతో కూడిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ , డీఎస్పీ అరుణ్ కుమార్ లకు సూచించారు. ఈ నెల 24,25,26 వ తేదీల్లో జరిగే నిమజ్జనానికి పోలీస్,రెవెన్యూ, రవాణా,వైద్య ఆరోగ్య,అగ్నిమాపక, అటవీ, ఇరిగేషన్,దేవాదాయ,పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఉన్నతాధికారులకు సమాచారం అదించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వినాయక నిమజ్జనానికి భద్రాచలం రానున్నారని తెలిపారు.నిర్దేశించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం చేయాలని,ప్రణాళికా బద్దంగా పనిచేసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాలకు రాకూడదని, విగ్రహాల నిమజ్జనం క్రమపద్ధతిలో జరగాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులు వినాయక విగ్రహాల ఊరేగింపులో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకుండా శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఊరేగింపుల సమయంలో డీ.జేలు, అధిక శబ్దపూరిత మ్యూజిక్ వాడకూడదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా మున్సిపల్, పోలీస్ శాఖల సూచనల మేరకు మాత్రమే ఊరేగింపులు కొనసాగించాలన్నారు.జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.ఉత్తర ద్వార దర్శనం, చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ,అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్ ను ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని తెలియజేసారు.ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ,డీఎస్పీ అరుణ్ కుమార్,పంచాయతీ ఈ.ఓ శ్రీనివాస్ రావు, దేవాలయ ఈ.వో దామోదర్ రావు,ఏం.వీ.ఐ సంఘం వెంకట పుల్లయ్య ఇరిగేషన్ ఏ.ఈ.ఈ లు రవితేజ, గణేష్, ఐ.టీ.సీ ప్రతినిధులు చెంగల్ రావు, దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ