తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేపు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్) గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం పర్యటన విజయవంతం చేయాలని టిబిజికెఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అక్రమ అరెస్టుతో జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ ని పరామర్శించనున్నారు. 10:30 గంటలకు ఇల్లందు రోడ్ లోని పాండురంగాపురంలో సేవాలాల్ మందిరం సందర్శించనున్నారు. 11:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు అనంతరం కార్యకర్తలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం:- 02:00 గంటలకు సప్తపది ఫంక్షన్ హాల్ లో జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. కావున ఈ యొక్క పర్యటన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ