Wednesday, 16 September 2026 04:22:56 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న నాగ సీతా రాములు

Date : 20 September 2025 12:40 PM Views : 380

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు కు ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. 3తరాల నుండి కాంగ్రెస్ పార్టీ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించిన నాగ సీతారాములు 1989లోనే ఎన్.ఎస్.యు.ఐ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాగ సీతారాములు యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఓబీసీ జిల్లా కన్వీనర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీపీసీసీ సభ్యులు, వంటి పదవులు నిర్వర్తించి నేడు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా, యాదవ విద్యావంతుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ గోకుల కృష్ణ ట్రస్ట్ చైర్మన్, బీసీ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా సేవలందిస్తున్నారు. కోవిడ్ 19 సమయంలో లో తమ ఎన్ఎస్సార్ ట్రస్ట్ ద్వారా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఏన్నో సేవలను అందించి, పార్టీలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు, పార్టీ పిలుపు మేరకు రచ్చబండ, గడప గడప ప్రోగ్రామ్స్ ద్వారా పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్, బీజేపీ పాలనలో పార్టీ పిలుపు మేరకు పెట్రోల్, డిజిల్, నిత్యవసరాల వస్తువు ధరల పెరుగుదలపై ఎన్నో ధర్నాలు, నిరసనల చేసిన నాగ సీతారాములు రాహుల్ గాంధీతో పాటుగా భారత్ జోడో యాత్రలో భాగంగా మక్తల్ నుండి మహారాష్ట్ర శివాజీ టెంపుల్ వరకు 13 రోజులు 385 కిమీ, రెవంత్ రెడ్డి పాదయాత్ర, మల్లు భట్టి పాదయాత్రలో, సైకిల్ యాత్ర , ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రల్లో పాల్గొన్నారు. తన సామాజిక సేవల ద్వారా అందరివాడుగా ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నాడు. ఎల్లలు దాటిన ఆయన సేవలను గుర్తించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీపీసీ ఇండియా) సంస్థ నాగ సీతారాములు ను గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు చైర్మన్ చైతన్య జంగా ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌టీపీసీ ఇండియా సంస్థ చైర్మన్ చైతన్య జంగా తోపాటు సెక్రెటరీ వీఎస్ వర్మ, మీడియా చైర్మన్ కిరణ్ బేజాడీ, డైరెక్టర్ చంద్రశేఖర్, కంట్రీ క్లబ్ అధినేత రాజివ్ రెడ్డి, అనుప్రసాద్ ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కాగా, ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు ను పలువురు రాజకీయ నాయకులు, కొత్తగూడెం పట్టణ ప్రముఖులు అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :