Wednesday, 16 September 2026 09:53:25 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్ల అంశాన్ని అగ్రిమెంట్లకు ముడిపెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న ఐ ఎన్ టీ యు సి నాయకులు

Date : 05 September 2026 04:00 PM Views : 63

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీవీకే–5 గనిలో సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌ పోస్టులపై జరిగిన సంభాషణను అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్‌టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను తిప్పికొట్టిన కార్మికులు. ఏఐటీయూసీ పోరాటాలతోనే సర్ఫస్ టూ సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ కొత్తగూడెం ఏరియా ఖాళీల భర్తీకి ప్రారంభించిన సీనియారిటీ లిస్టును రద్దుచేయించిన ఘనత ఎఐటియుసిది మాత్రమే...వీరస్వామీ,జక్కుల గట్టయ్య. సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్ల పోస్టుల అంశాన్ని ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో ఏఐటీయూసీ కుదుర్చుకున్న అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్‌టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమేనని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శి జక్కుల గట్టయ్య అన్నారు.పీవీకే–5లో సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌ పోస్టులపై జరిగిన సంభాషణకు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సింగరేణిలో అండర్‌గ్రౌండ్‌ జనరల్‌ అసిస్టెంట్లను సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్లుగా కన్వర్షన్‌ చేయించేందుకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడిందన్నారు.సర్ఫేస్‌ కన్వర్షన్‌లో సింగరేణి వ్యాప్తంగా సీనియారిటీ లిస్టును ప్రాతిపదికగా తీసుకోవాలన్న యాజమాన్య నిబంధనను వ్యతిరేకించి, పోరాటాల ద్వారా కొత్తగూడెం ఏరియాలో ఆ నిబంధనను రద్దు చేయించామని తెలిపారు.సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీ కోసం జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు, జీఎం పర్సనల్‌, డైరెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించామని పేర్కొన్నారు.అండర్‌గ్రౌండ్‌ కార్మికులకు కన్వర్షన్‌లో అన్యాయం జరగకూడదన్నదే ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్‌ అని తెలిపారు.మరోవైపు మణుగూరు సర్ఫేస్‌ కార్మికులను కొత్తగూడెంకు బదిలీ చేయిస్తామంటూ కొందరు ఐఎన్‌టీయూసీ నాయకులు డబ్బులు వసూలు చేసి సర్ఫస్ టూ సర్ఫస్ జనరల్ అసిస్టెంట్స్ కొత్తగూడెం ఏరియా ఖాళీలను భర్తీచేయాలని సర్క్యులర్ తెప్పించింది మీరుకదా అని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.సత్తుపల్లి సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ కన్వర్షన్‌లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎన్‌టీయూసీ నాయకులు యాజమాన్యానికి వినతిపత్రం ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.కార్మిక ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ పోరాడి ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో పలు కీలక అగ్రిమెంట్లు సాధించిందన్నారు.వాటిని కార్మికులకు వివరిస్తూ పీవీకే–5లో గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తుంటే కొందరు ఐ ఎన్ టీ యు సి కార్యకర్తలు గొడవలు సృష్టిస్తూ సమావేశాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.శాంతియుత సమావేశాలకు ఆటంకం కలిగించకుండా, దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి బ్రాంచ్‌ కార్యదర్శి సుధాకర్‌, పిట్‌ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్‌, నాయకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :