తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోనిన్న కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని శనివారం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాల్వంచ మండలం పాయకారి యానం బైలు , రాజాపురం గ్రామాల్లో మక్కజొన్న పంటను సందర్శించి నష్టం స్థాయిని అంచనా వేశారు. ప్రాథమికంగా 7 గ్రామాల్లో 190 మంది రైతులకు చెందిన సుమారు 265 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ