తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో తమ ఉద్యోగాలు కోల్పోయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలకు(JMET) యాజమాన్యం మరో అవకాశం కల్పించింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో టెర్మినేట్ అయిన ట్రైనీలు తిరిగి విధుల్లో చేరడానికి మార్గం సుగమమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పనిచేయాలని యాజమాన్యం సూచించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ