Wednesday, 04 November 2026 02:00:08 PM
# కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి.

ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 07 September 2026 12:57 PM Views : 179

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి గోడౌన్ భవనం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల పనితీరుపై ఆరా గోడౌన్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్ల భద్రత విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా సోమవారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా గోడౌన్‌కు ఉన్న సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఎన్నికల అధికారుల సమక్షంలో గోడౌన్‌ను తెరిపించి లోపలికి వెళ్లి ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. యంత్రాల భద్రత, గోడౌన్‌లో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం గోడౌన్‌ను తిరిగి సీల్ చేయించారు. గోడౌన్ భవనాన్ని కూడా జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. భవనంలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, భవనం పరిస్థితి సక్రమంగా ఉందా అనే అంశాలను పరిశీలించారు. అలాగే అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉన్నాయా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనే విషయాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గోడౌన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నియంత్రణ గదిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్నాయా, గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా కొనసాగుతున్నదా అనే విషయాలను పరిశీలించారు. గోడౌన్ భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా ఎవరూ గోడౌన్‌లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు సంబంధించి నిర్దేశిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. గోడౌన్ తనిఖీకి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ తనిఖీ రిజిస్టర్‌లో నమోదు చేసి సంతకం చేశారు. ఈ తనిఖీ లో కొత్తగూడెం ఆర్టీవో మధు,ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లక్ష్మణ్ అగర్వాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది నవీన్, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :