Monday, 02 November 2026 08:02:48 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు.

Date : 27 June 2026 07:14 PM Views : 219

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదల ఇండ్ల కూల్చివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలి.బాధితుల హక్కుల సాధన కోసం జులై 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా.పేదల ఇండ్ల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తాం.ధర్నా జయప్రదానికి ఉమ్మడిగా కదిలిరావాలి.ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో సిపిఐ, సిపిఎం ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పేదలు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేస్తూ జులై 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమ విజయవంతం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న నివాసాలకు కనీస వసతులైన ఇంటి నెంబర్లు, కరెంట్ కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చే దుర్మార్గపు చర్యలను తక్షణమే మానుకోవాలని, వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితుల హక్కుల సాధన కోసం జులై 1న జరగబోయే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయడానికి ఇండ్ల బాధితులను పెద్ద ఎత్తున తరలించాలని కోరారు. పేదల ఇండ్ల సమస్యలపై రాబోయే రోజుల్లో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ధర్నా జయప్రదానికి ఉమ్మడిగా కదిలిరావాలని పిలుపునిచ్చారు. న్యూ డిమోక్రసి జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వర్ రావు, మాస్ లైన్ నాయకులు పి సతీష్ మాట్లాడారు. సమావేశంలో సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, మేయర్ మూడ్ గణేష్, సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, సిపిఐ, న్యూ డిమోక్రసీ, నాయకులు భూక్యా శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, గడ్డం ప్రభాకర్, వెంకట్, మోతుకూరి మల్లికార్జున్ రావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :