Wednesday, 16 September 2026 04:09:33 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 01 March 2025 07:18 PM Views : 739

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..మార్చి 21నుండి ఏప్రిల్ 4వరకు ఉదయం 9గంటల 30నిమిషాల నుండి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో 12,282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలను నిశపక్షపాతంగా నిర్వహించేందుకు 73 చీఫ్ సూపరిడెంట్స్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 7 రూట్ ఆఫీసర్స్, 73 డిపార్టుమెంటల్ ఆఫీసర్స్,26 సెంటర్ కస్టోడియన్స్, 73 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా,పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు భద్రంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు మరియు మరుగుదొడ్ల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని,ఇందుకు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసి, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు,తగిన మందులతో ఆశాలను, ఎ ఎన్ లను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓ కు సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, పోలీస్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :