Monday, 03 August 2026 09:58:18 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కార్మిక ప్రాంతం రామవరంలో డిస్పెన్సరీ యధావిధిగా నడిపించాలి. వినతిపత్రం అందచేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు.

Date : 01 June 2026 08:38 PM Views : 295

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక ప్రాంతం రామవరంలో డిస్పెన్సరీ యధావిధిగా నడిపించాలి. వందలాది కార్మికలు,కార్మిక కుటుంబాల,పదవీవిరమణ,పొంది ఉన్న కార్మికుల రామవరం ప్రాంతంలో ఆస్పత్రిని తక్షణమే యధావిధిగా పునరుద్దరించి, పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలి.సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్యవైద్యాధికారి కి వినతిపత్రం అందచేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు.రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేతను యాజమాన్యం తక్షణమే విరమించుకో వాలని, డిస్పెన్సరీని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్యవైద్యాధికారి(సి ఎం ఓ)కిరణ్ రాజ్ కు ఎఐటియుసి నాయకులు వినతిపత్రం అందజేశారు,ఈ సందర్భంగా ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లడుతూ రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబాలతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ వైద్యశాల ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తోందని, ఈ డిస్పెన్సరీలో కొత్త వైద్యుల నియామకం చేపట్టి,సరైన స్టాఫ్ నియమించి కార్మికులకు మందులు ఇచ్చేలా చూడాలని కోరారు, ఇక్కడ పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, కొత్తవారిని నియమించకుండా డిస్పెన్సరీకి ఏకంగా సీల్ చేయడం సరైంది కాదన్నారు. ఈ డిస్పెన్సరీని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి వైద్య సేవలకు సైతం సుదూర ప్రాంతంలోని ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం వైద్యులను, సిబ్బందిని నియమించి ఆస్పత్రిని రామవరం డిస్పెన్సరినీ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు,సానుకూలంగా స్పందించిన (సి ఎం ఓ) కిరణ్ రాజ్ డిస్పెన్సరీ భవనం పునర్నిర్మాణం చేసి త్వరితగతిన సమస్యను పరిష్కరించి రామవరం డిస్పెన్సరీ లో డాక్టర్ ను, స్టాఫ్ ను నియమించి పునరుద్ధించేల చేస్తామని హామీ ఇచ్చారు,కావున కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రామవరం డిస్పెన్సరీ ఏరియా అధీనంలో ఉంది కాబట్టి డిస్పెన్సరీ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి,సహాయ కార్యదర్శులు గట్టయ్య,రాము,వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు,పిట్ కార్యదర్శిలు అనంతలక్ష్మి,మధు కృష్ణ, కమల్,ఆఫీస్ బ్యారర్స్ నాగయ్య,కర్రు రమేష్,సీనియర్ నాయకులు మర్రి గోపి,లక్ష్మీనారాయణ,మండల రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :