తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 5 (తెలుగు వెలుగు) : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం భక్తుల కన్నుల పంటగా, వేదమంత్రాలు నడుమ మిథిలా స్టేడియంలో వైభవోపేతంగా జరగనుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం భద్రాచలం రానున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ