Thursday, 17 September 2026 08:17:16 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.

Date : 06 June 2026 07:51 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించండి లేదంటే ఉద్యమం తప్పదు - సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి.ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం.ఆరు జిల్లాల నుంచి 151 మంది ప్రతినిధుల పాల్గొనింపు – కార్మిక సమస్యలు, సింగరేణి భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీలలో కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కొత్తగూడెం శాసనసభ్యులు,ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సమావేశాలకు సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల నుంచి సుమారు 151 మంది యూనియన్ ప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.సమావేశంలో సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, యాజమాన్యం మరియు ప్రభుత్వాల విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి పెంపు, సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎండీ స్థాయి నిర్మాణాత్మక సమావేశాలు గుర్తింపు సంఘం తో నిర్వహించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న 11వ క్యాడర్ స్కీమ్ అమలు, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాల నిర్వహణ, మారుపేర్ల సమస్య పరిష్కారం, పర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్ను భారం తొలగింపు, ప్రతి కార్మికునికి 200 గజాల ఇంటి స్థలం కేటాయింపు, రూ.30 లక్షల వడ్డీలేని గృహ రుణం మంజూరు వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి.అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిలను తక్షణమే వసూలు చేయాలని సమావేశం డిమాండ్ చేయనుంది.కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్ పోరాటాలు, ఉద్యమాల రూపకల్పనపై రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయని మిరియాల రంగయ్య తెలిపారు.కొమరయ్య విగ్రహావిష్కరణకు భారీగా తరలిరావాలి.ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పునఃప్రారంభించే మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, కార్మికులు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :