Wednesday, 16 September 2026 04:10:25 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 01 June 2026 04:02 PM Views : 76

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు . ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుండి 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేలా ఉండాలని, ప్రతి గ్రామం, విద్యాసంస్థలు , ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, నాటిన ప్రతి మొక్కను పెంచి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దినప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని అన్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 55 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం ఉందని, అన్ని శాఖల సమన్వయంతో గత రెండు సంవత్సరాలుగా ఒక్క ఎకరం పోడు భూమి కూడా నరికివేయకుండా సంరక్షించగలిగామని తెలిపారు. జిల్లాలో పామాయిల్, జామాయిల్, వెదురు తదితర పంటల సాగు విస్తరించడంతో జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని, రాష్ట్రంలో పచ్చదన పరిరక్షణలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ గోడపత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది విధుల నిర్వహణలో భద్రతకు ఉపయోగపడే సేఫ్టీ కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశంలో అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :