Thursday, 17 September 2026 07:03:27 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

గంజాయి కేసుల్లోని నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు.

Date : 25 October 2025 07:01 PM Views : 652

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ నిషేదిత గంజాయి అక్రమ రవాణా కేసులలోని నిందితుడిపై పీడియాక్టు నమోదు. నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో నిందితుడిగా ఉన్న దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిపై జూలూరుపాడు పోలీసులు పీడియాక్టును నమోదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ సలహాలతో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, బూర్గంపాడు మండలం సారపాక,తాళ్లగొమ్మూరుకు చెందిన నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడియాక్ట్ నమోదుకై ఉన్నతాధికారులకు తగిన పత్రాలను సమర్పించారు.అక్రమార్జనే ధ్యేయంగా అలవాటుగా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడు శివశంకర్ రెడ్డిపై బూర్గంపాడు,జూలూరుపాడు మరియు హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ల నందు కేసులు నమోదు చేయడం జరిగింది.తనపై ఉన్న కేసులలో జైలుకు పోయి తిరిగి వచ్చి తీరు మార్చుకోకుండా మరలా గంజాయి రవాణాకు పాల్పడుతున్న నిందితుడిపై పీడి యాక్టును అమలు చేస్తూ 23.10.2025న పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.ఉన్నతాధికారుల నుండి పీడియాక్ట్ ఉత్తర్వుల కాపీనీ అందుకున్న జూలూరుపాడు పోలీసులు చర్లపల్లి జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి అందజేశారు.గంజాయిని అక్రమంగా రవాణా చేసి నిందితుడు శివశంకర్ రెడ్డి సంపాదించిన ఆస్తులను కూడా గతంలో గౌరవ కోర్టు వారి ఆదేశాలతో జూలూరుపాడు పోలీసులు జప్తు చేయడం జరిగింది.గంజాయి కేసుల్లోని నిందితుడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పీడియాక్ట్ ను నమోదు చేయడం జరిగిందని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఇలాంటి నేరస్తుల వలన ఎంతో మంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.అందుకే గంజాయి సమూల నిర్మూలన కొరకు జిల్లా పోలీస్ శాఖ తరపున చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని చేపట్టి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు,జిల్లా ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అలవాటుగా ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పాడే వ్యక్తులను గుర్తించి,వారిపై కూడా పీడియాక్టులను నమోదు చేయనున్నామని తెలియజేసారు.నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడి యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి మరియు సిబ్బందిని ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :