తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 16 ( తెలుగు వెలుగు) జూలూరుపాడు రామాలయం ఆలయ కమిటీ వారు నూతనంగా రామాలయం వద్ద వేద పండితుల చేత విగ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపించారు ఈ సందర్భముగా ప్రత్యేకమైన హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి విగ్రహ దాతలు పెంటికల వెంకటేశ్వర్లు, పెంటికల వీరబాబు, పెంటికల మహేష్ మరియు గ్రామస్తుల సహాయ సహకారాలతో జరిపించారు. ప్రతిష్టా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ