తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 9 తెలుగు వెలుగు) : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందునందు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాలను పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు రంగోలి ముగ్గుల పోటీ నిర్వహించడం గాలిపటాలు ఎగురవేయడం భోగిమంటలు వేసి విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషంగా ముందస్తు సంక్రాంతి వేడుక జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎన్ ఉమా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ సెలవులను ఉపయోగించుకొని చక్కగా ఇంటి దగ్గర చదువుకోవాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరుగవద్దని పాఠశాల సెలవులను ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి పునః ప్రారంభం రోజున అందరూ, క్షేమంగా కచ్చితంగా పాఠశాలకు హాజరుకావాలని కోరుతూ విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులైన శాంతకుమారి వెంకటేశ్వర్లు రామనాథం ఉమామహేశ్వరి సర్దార్ వల్లభాయ్ పటేల్ బోడా కృష్ణ సునీత లలిత జివిఆర్ ప్రసాద్ శకుంతల ఉపేంద్రమ్మ మొదలైన వారు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ