Wednesday, 16 September 2026 09:53:18 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్.

Date : 29 August 2026 06:44 PM Views : 101

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్.డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.వార్షిక తనిఖీల్లో భాగంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించి సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్, దేవాలయాల పరిసరాలు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ 2.0లో ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌డేట్ చేయాలని సూచించారు. బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే నియంత్రించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తిరుపతి మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :