తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై రాజేందర్ ను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ ఈ రోజు పదవీ విరమణ ఎస్బి ఎస్సై రాజేందర్ ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తూ ఈ రోజుతో పదవీ విరమణ పొందారు. 43 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన రాజేందర్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అన్నారు. గత 43 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ తాము సాధించిన అనుభవాన్ని ఈ రోజు పదవీ విరమణ పొందిన రాజేందర్ ఎస్పీ కి వివరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ మల్లయ్య స్వామి,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏసోబు మరియు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ