Wednesday, 16 September 2026 09:17:22 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశం

Date : 03 July 2025 07:12 PM Views : 618

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, నర్సింగ్ సూపర్డెంట్లు, ఫార్మాసిస్టులతో ప్రత్యేక సమావేశం విష జ్వరాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో రాబోయే రోజుల్లో విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున ఆసుపత్రి సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఈరోజు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రకాల మందులు, రీఏజెంట్లు, టెస్టింగ్ కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.వివిధ హోదాల్లో ఉన్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించి 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు .ఇప్పటికే అన్ని ఆసుపత్రులలో కావాల్సిన మందులు రీఏజెంట్లు ,మౌలిక వసతులు మరియు ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసిన క్రమంలో రాబోయే రోజుల్లో రోగు లను ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా ఆసుపత్రులలో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి తగిన పరిష్కార ఏర్పాట్లు తాను చేస్తానని , అవసరమైన నిధులు మంజూరు కి ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో ఇన్సులిన్, మలేరియా మందులు అందుబాటులో లేవని వాటి గురించి వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రాష్ట్ర అధికారులతో మాట్లాడి వాటిని అందుబాటులోకి తీసుకొనిరాడానికి ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు .ఈ సమీక్ష సమావేశంలో జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు,ఫార్మసిస్టులు ,నర్సింగ్ సూపరింటెండెంట్ లు మరియు శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :