Thursday, 02 July 2026 06:56:35 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

పేదలలో అత్యంత పేదలకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 29 November 2024 12:31 PM Views : 776

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదలలో అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ మరియు జిల్లాలో నెలకొన్న భూ సమస్యలపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు మరియు జిల్లాలోని అందరు తాసిల్దారుల తో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. కరకగూడెం మరియు చర్ల మండలాలు ఆరు మూల ప్రాంతాల్లో ఉండటం, విద్యుత్ అంతరాయం, నెట్వర్క్ సమస్య మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కొరత ఉన్నందువలన బూర్గంపాడు మండలం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కరకగూడెం మరియు చర్ల మండలం డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని, భద్రాచలం ఆర్డీవో ని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పూర్తి అయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారులు ఎంపిక కు తాసిల్దారులు అందరూ క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలలో పర్యటించి పేదలలో అత్యంత పేద వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, గుడిసెలలో జీవనం సాగిస్తున్న వారిని గుర్తించాలన్నారు. తాసిల్దారులందరూ ఈరోజు తమ పరిధిలోడికి వచ్చిన దరఖాస్తులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పేదవారిని గుర్తించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. తాసిల్దారులు గుర్తించిన పేదవారిని ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారించి తుది జాబితా సిద్ధం చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో అధికారులు మరియు ఉద్యోగస్తులు ఎటువంటి పైరవీలు లేదా అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించేది లేదు అని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా గిరిజనేతరులకి విభజన పేరుతో పట్టా మార్పు లేదా భూమి అమ్మకానికి అధికారులు సహాయం చేస్తే వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :