తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక, రవాణా మరియు పోలీస్ శాఖలతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పత్రిక కొనుగోలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం న్యాయమైన మద్దతు ధర పొందేలా ప్రతి అధికారి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1,72,937 ఎకరాలలో పత్తి పంట సాగు జరిగిందని, 26 లక్షల 56,14 0 క్వింటాళ్ల పత్తి దిగుబడి కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2025-26 గాను పత్తికి మద్దతు ధర 8110/- ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు చేపట్టడానికి గాను సీసీ ఐ క్రింద ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా, రైతు ఇచ్చిన పత్తి బరువును కచ్చితంగా నమోదు కావాలని, వ్యాప్తంగా ఉన్న వే బ్రిడ్జి లను తనిఖీ చేయాలని తూనికలు కొలతల శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా సకాలంలో జరగాలని ఇందుకోసం పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని సూచించారు, కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, వసతి, గోదాములు, తేమ పరీక్షించే యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తీసుకువచ్చి అమ్మే విధంగా ఎటువంటి మధ్యవర్తులు లేదా అక్రమంగా పత్తి కొనుగోలు చేసి వారి ప్రభావానికి లోను కాకూడదని కలెక్టర్ సూచించారు. పత్తి మిల్లుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తి దిగుబడి అనంతరం పత్తి కట్టేను బయో చార్ తయారీ ఉపయోగించే విధంగా రైతులలో అవగాహన తీసుకురావాలని మిల్లర్లకు కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, తూనికలు కొలతలు శాఖాధికారి మనోహర్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల అధికారులు మరియు మిల్లర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ