Wednesday, 16 September 2026 06:01:18 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 24 December 2025 08:39 PM Views : 603

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 34 అండర్ ఇన్వెస్టిగేషన్ అట్రాసిటీ కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా, నిబంధనల ప్రకారం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.అత్యాచారానికి గురైన మహిళలకు భరోసా కల్పించేందుకు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయం, మానసిక ధైర్యం అందేలా చూడాలని సూచించారు. అలాగే పాఠశాల స్థాయిలోనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు యుడైస్ (UDISE) సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు స్థితిగతులపై సమగ్ర నివేదికలు అందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటిపై క్షేత్రస్థాయిలో కమిటీల ద్వారా యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో జనవరి 18, 19 తేదీల్లో కమిటీ సభ్యులను హైదరాబాద్ శిక్షణ కేంద్రాలు, పాల్వంచలోని చరిత ఆర్గానిక్ ఫారం, పట్టుపురుగుల పరిశ్రమ, లోతువాగులోని సమీకృత వ్యవసాయం, మోరంపల్లి బంజర మోడల్ ఫామ్ హౌస్, మిట్టగూడెం చేపల పెంపకం యూనిట్‌లకు అధ్యయన సందర్శనకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చట్టపరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. బాధితుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కేసుల విచారణలో ఎలాంటి అలసత్వం వహించబోమన్నారు. బాధితులు న్యాయం పొందే వరకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, అవసరమైతే ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, సూపర్డెంట్ హనుమంతరావు, సీనియర్ సహాయకులు ప్రసాద్, జిల్లా విజిలెన్స్ అండ్ మహా ఎడిటింగ్ కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :