తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం. ఉద్యాన శాఖ ద్వారా బొప్పాయి తోటలకు రూ.12,000/- ప్రోత్సహం అందిస్తుంది దానికోసం మండలంలోని కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకోగా వారి పొలాలను పరిశీలించిన అధికారులు ఉద్యాన శాఖ ద్వారా బొప్పాయి తోటలకు MIDH పథకం ద్వారా 40% సబ్సిడీ ఎకరానికి రూ.12000/- అందజేయబడుతుందని ఈరోజు జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జంగ కిశోర్ జూలూరుపాడు మరియు సుజాతనగర్ మండలాలోని రైతులు సబ్సిడీ కొరకు ధరఖాస్తు చేసుకున్న వారి పొలాలను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ 1.8 X 1.8 Mt దూరంలో నాటుకున్నట్లైతే ఎకరానికి 1234 మొక్కలు అవసరమవుతాయి. పంటకాలం 9 నెలలలో కోత ప్రారంభమై 18 నెలలు వరకు ఉంటుంది. దిగుబడి 30 టన్నులు ఒక ఎకరానికి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.12/- Kg , మొత్తం ఆదాయం రూ.360000/- నికర ఆదాయం రూ.260000/-, కావున ఆసక్తి కలిగిన రైతు సోదరులు సంబందిత ఉద్యాన అధికారులకు సంబందిత దస్త్రాలు, ధరఖాస్తులు సమర్పించవలసినదిగా కోరడమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ