తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ఈ రోజు (గురువారం) గరిమెళ్ళపాడు HNTC నర్సరీని సందర్శించారు. సుమారు 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న గరిమెళ్ళపాడు HNTC ను పూర్తిగా కలియతిరిగి పరిశీలించారు. గతంలో ఉన్న పాత భవనాలను ఒక్కొక్కటిగా నిశితంగా పరిశీలించారు.అలాగే ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలు, గతంలో ఉన్న మొక్కలు, వివిధ విభాగాలు తదితర ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి, హార్టికల్చర్ సిబ్బంది రాజారామ్ నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తదనుగుణంగా గతంలో నర్సరీ ఏ విధంగా ఉండేదో, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో సమీక్షించి, మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒకప్పటిలాగా మళ్లీ పూర్వ వైభవం తీర్చిదిద్దేలా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ