తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు శుక్రవారం ఆటోలో వెళుతుండగా తునికిచెరువు దగ్గర ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కుంజా దీపక్ అనే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ