తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుంటూరు లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం.నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ,ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్కో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ రాష్ట్రం లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలో గల రామవరం ప్రాంత నివాసులు అభ్యుదయ సామాజిక కవులు తూముల శ్రీనివాస్, మహమ్మద్ ముస్తఫా, సయ్యద్ అబ్దుల్ నజీర్ లు , 6 వ తేదీ న శ్రీ జాషువా శ్రీ కరుణ శ్రీ వేదికపై తెలుగు తల్లికి సహస్ర కవిత నీరాజనం కవి సమ్మేళనంలో గజల్ కవి గజల్ రాజేష్, డాక్టర్ ఎస్ ఆర్ఎస్ కొల్లూరి, కలిమి సంచాలకులుగా నిర్వాహన సారధ్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని సబికుల కరతాల ధ్వనుల మధ్యన ప్రశంసలు అందుకోవడం జరిగినది, ఐదవ తేదీ చివరి రోజు అయిన సోమవారం మధ్యాహ్న 12 గంటలకు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్. కు గర్వకారణమని,ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా తన భుజస్కందాలపై వేసుకొని నిర్వహిస్తూ ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి తెలుగువారు పాల్గొనడం అభినందనీయమని ఆంగ్ల మాధ్యమాలు ఎన్ని ఉన్నా తెలుగు కున్న గొప్పతనం గౌరవం ఎవరు తగ్గించలేరని చంద్రబాబు నాయుడు అన్నారు, దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయ లు అన్నమాట వాస్తవమని పర భాష పాలకులుఈ ప్రాంతాలను పాలించిన తెలుగు పై ఎలాంటి ప్రభావం పడలేదని తెలుగు నిరంతరం వెలుగుతూనే ఉంటుందని అన్నమయ్య, నన్నయ్య, తిక్కన, పోతున్న, ఎర్ర ప్రగడ, శ్రీ నాథుడు, కవి సార్వభౌములతో పాటు గిడుగు రామ్మూర్తి లాంటి మహానుభావులు తెలుగును బ్రతికించడం కోసం తెలుగు విలువలను పెంచడం కోసం ఎంతగానో శ్రమించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమానించారు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా తెలుగు వ్యాకరణం నేర్పించడం కోసం ఆదేశాలు జారీ చేస్తానంటూ వారన్నారు సంగీత కళాశాలలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు, ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో మూడు రోజులపాటు యువ ఆవదనులచే ఆవధానాలు, వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులచే తెలుగు వైభవ సాంస్కృతిక ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ, పద్య నాటకం, సాంఘిక నాటకం, జానపద కార్యక్రమాలు, శాస్త్రీయ లలిత సంగీతం, చలనచిత్ర సంగీతం, కూచిపూడి ఆంధ్ర నాట్యం, చలనచిత్ర నటులచే హాస్య కదంబరం, సాహితీ సదస్సులు, వీధి నాటకాలు కవి సమ్మేళనాలు, సంచార జాతుల కళాకారుల కార్యక్రమాలు, ఆంధ్ర వైభవ పురాతన నాణేల ప్రదర్శన, తెలుగు కార్టూన్ల ప్రదర్శన, ఆంధ్ర వైభవ చిత్రలేఖన ప్రదర్శనలు, లఘు చలనచిత్ర ప్రదర్శనలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, పద్య శతక సామూహిక పట్టణం, ఆంధ్ర వంటకాలు, పిండి వంటలు, తెలుగు వెలుగు శిల్పారామం, తోలుబొమ్మలాట, బొమ్మలాట, శ్రీ రసరాజు రచించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ రూపొందించిన తెలుగు తోరణం క్షేత్ర దర్శని ప్రత్యేక నృత్య రూపకములు, ఇత్త్యధి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మూడు రోజులు ఎలాంటి కవులు కళాకారుల చేతి అంగరంగ వైభవంగా జరగడం ఆనందోత్సవాలతో నిర్వహించడం అభినందనీయం అని చంద్రబాబు నాయుడు అన్నారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ