తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత అర్థ శతాబ్ది కాలంగా కొత్తగూడెం ప్రజలకే కాకుండా అనేక ప్రాంతాల వారికి వైద్య పరంగా సామాజికపరంగా సేవలను నిరంతరాయంగా అందిస్తున్న ప్రముఖ సీనియర్ సర్జన్ డా. వి రమేష్ బాబు (యం.ఎస్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి ప్రేమికులు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద గల నవీన్ నర్సింగ్ హోమ్ అధినేత, జాతీయ బాలోత్సవ్ కన్వీనర్, సీనియర్ వైద్యులు, సామాజ సేవకులు, ప్రకృతి ప్రేమికులు, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కలను అందజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, ప్రకృతి వైద్యులు జి.సుగుణారావు, చిన్నారి మొక్కల ప్రేమికురాలు నైనికా రజువా, ప్రకృతి ప్రేమికులు దశరథ్ రజువా, గోరింట్ల శోభారాణి, ఝాన్సీ లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ