Sunday, 02 August 2026 04:08:22 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు.

Date : 16 April 2026 06:12 PM Views : 348

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన Arrive-alive అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో వాహనదారులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించారు.ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇల్లందులోని అయిత ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మందికి పైగా స్థానికులు,ప్రముఖులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం,గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు,ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని,కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు.ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం,అతివేగం,మద్యం సేవించి వాహనం నడపడం,మొబైల్ ఫోన్ వినియోగం మరియు చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వలననే జరుగుతున్నాయని తెలిపారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు,సుదూర ప్రయాణాలు చేసే లారీ మరియు బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే,ట్రాఫిక్ సిగ్నల్స్,రోడ్ సైన్ బోర్డులు,ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా,సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :