తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండలంలో నెలరోజులుగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి రైతుకి సరిపడా యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించి తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. మంత్రులు పరిష్కారం చూపకపోవడం సిగ్గుచేటని, వెంటనే యూరియా పంపిణీ చేసి కొరత లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ