తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం పెనుబల్లి మండలం వీఎం బంజరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ