Monday, 03 August 2026 07:56:48 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా

Date : 23 October 2024 05:44 PM Views : 654

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్యం చేస్తే విద్యార్థులు చదువుకునేది ఎట్లా అని, ఫీజు బకాయిల విడుదల పై ప్రభుత్వం చేస్తున్న జాప్యం సరికాదని. గత మూడు విద్యాసంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల లేక విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇబ్బందులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు చెల్లించలేక ప్రైవేట్ డిగ్రీ,పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూన్నాయని. ఫీజుబకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేసిన ప్రభుత్వం విడుదల చేయకుండా పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు . గత ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ఆనాటి పీసీసీ అధ్యక్షుడు , నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని విద్యాశాఖ కూడా తన వద్దే పెట్టుకున్న విద్యాశాఖ కి నిధులు కేటాయించి విద్యార్థులకు ఖర్చు చేయడం లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, రాష్ట్రంలో అనేక రకాల ఖర్చులు చేస్తూ అనేక చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయడంలో చేస్తున్న నిర్లక్ష్యం సరికాదని వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు టోకెన్ ఇచ్చినవి కాకుండా పెండింగ్ లో ఉన్న బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేయాలని లేని యెడల విద్యార్థుల సమీకరించి భవిష్యత్తును ఉద్యమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 27 లోపు బకాయిలు చెల్లించకపోతే చలో ఇంద్ర పార్క్ కార్యక్రమం నిర్వహించే హైదరాబాద్ నీ దిగ్భంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వరక అజిత్, షాహిద్, గుగులోత్ వంశీ, పవన్ సాయి, సృజన్, బానోత్ శ్రీను, వినయ్, నాగేంద్రబాబు,

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :