Friday, 18 September 2026 08:10:32 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్

Date : 29 July 2026 06:11 PM Views : 126

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైద్యాధికారుల జూమ్ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణపై జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCలు), ఏరియా ఆసుపత్రులు (AHలు), టీచింగ్ ఆసుపత్రులు (THలు), జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు (GGHలు), వైద్య కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటళ్లు మరియు ప్రైవేట్ క్లినిక్‌లు తప్పనిసరిగా మూడు అంశాలను అమలు చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో కుక్క కాటు (Anti Rabies Vaccine) మందులు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఆసుపత్రిలో కుక్క కాటు కేసుల పర్యవేక్షణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఈ వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. అదేవిధంగా, వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయాలని, హాస్టల్ సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. హాస్టల్లో వంట చేసే వారికి తప్పనిసరిగా జుట్టు చేతి గోర్లు కత్తిరించుకోవాలని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారికి సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి వారాంత నివేదికలను సూపర్వైజర్లు, వైద్యాధికారులకు సమర్పించాలని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా వ్యాధులు అధికంగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రోగ్రాం అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఎన్సీడీ స్క్రీనింగ్, శ్రమదానం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA), ఆరోగ్య మహిళ, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ అనుమానితుల గుర్తింపు, రోగులకు మందుల పంపిణీ, వైద్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందిస్తూ నిరంతర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :