తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 11 (తెలుగు వెలుగు) : అణగారిన వర్గాలకు అక్షర జ్యోతిలా మారిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావుపూలే అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పూలే 198వ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సంధర్భంగా కామేష్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ది జరుగుతుందని పూలే భావించారని,అక్షరాలను ఆయుధంగా చేసుకుని అణగారిన వర్గాల విద్యాభివృదికి కృషి చేశారని,సమసమాజ స్థాపన కోసం పూలే చేసిన పోరాటాలు చూపిన కార్యదీక్షత ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు.పూలే సంఘ సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.తనతో పాటు తన సహచరురాలు సావిత్రిభాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయురాలిని చేశారని,పూలే దంపతులు 54 విద్యాలయాలు నిర్మించారని కొనియాడారు.మహిళల హక్కులు,విద్యా బోధన,సతీ సహగమనికి వ్యతిరేకంగా పోరాడి స్త్రీలకు పునర్వివాహలు జరిపించారన్నారు.నేటి యువత అయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ