తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలం గరీబ్ పేట గ్రామానికి చిలువేరు పుల్లయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఇందిరమ్మ ఇల్లు గూడు లేని నిరుపేదలకు వరాల జల్లు అని అన్నారు. నిరుపేదలను ఇంటి యజమానులను చేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు సారథ్యంలో దానిని అంకితభావంతో జిల్లాలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మన రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రోహిణి,ఉప సర్పంచ్ రెడ్డి బోయిన వెంకన్న , ఎక్స్ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, ఎక్స్ ఎంపీటీసీ శైలజ,జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు యండి కరీం పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ బిక్షం,పెద్ద వెంకన్న, సైదులు,బైకాని ఉపేందర్,సుజాతనగర్ మండల ఓబీసీ అధ్యక్షులు కసన బోయిన లక్ష్మణ్, టౌన్ ఓబీసీ అధ్యక్షులు జయప్రకాష్,సోషల్ మీడియా అధ్యక్షులు బీరెల్లి వీరభద్రం,వార్డు సభ్యులు కట్టెబోయిన లింగమల్లు ,మాలోత్ రాజు, మరియు గ్రామస్థులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ