తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ట్రాఫిక్ విధులను నిర్వర్తించే అధికారులు,సిబ్బంది వేసవికాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఎండాకాలంలో ట్రాఫిక్ విధులను నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఎండ వేడిమి నుండి సరైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.బుధవారం ఎస్పీ కార్యాలయంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు.ఒక రౌండ్ టోపీ,కళ్ళజోడు,ఒక వాటర్ బాటిల్,30 ORS ప్యాకెట్లు,60 మాస్క్ లు కలిగిన కిట్లను ఎస్పీ అందజేశారు.ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది ప్రతి ఒక్కరి పనితీరు గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.గురించి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లపై విధులు నిర్వర్తించేటప్పుడు తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కిట్లను అందజేయడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. విధుల పరంగానైనా,వ్యక్తిగతంగానైనా ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఎండ వేడిమి నుండి ఎప్పటికప్పుడు తమను తాము సంరక్షించుకోవాలంటే ఎక్కువగా నీళ్లు త్రాగాలని సూచించారు.ట్రాఫిక్ రూల్స్ పై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకై భాద్యతగా విధులు నిర్వరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ