తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం కొత్తగూడెం భజన మందిరం సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, హారతి పంచామృతాభిషేకం అలంకరణ, సహస్ర నామార్చన, గురువులకు సన్మానం, భజన, హారతి సమర్పించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు శ్రీరంగం రమణాచార్యులు, ఈవో సులోచన, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ